Header Banner

అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం! రైతులకు నాదెండ్ల భరోసా.! చెప్పులు విడిచి..

  Mon May 05, 2025 22:31        Politics

రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు ప్రభుత్వ అండపై భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఉదయం పెద్దాపురం మండలం జే.తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రాపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులతో కలిసి కల్లాల్లో ఆరబోసిన, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల కాళ్లకు ధరించిన చెప్పులు విడిచి కల్లాల్లో నడిచారు. తద్వారా, చెప్పులతో ధాన్యం తొక్కకూడదన్న రైతుల సెంటిమెంట్ ను గౌరవించారు.

 

ఇది కూడా చదవండి: సింహాచలం దుర్ఘటనలో బాధ్యులపై సస్పెన్షన్.. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు!

 

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షం వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందని, ప్రతి రైతునూ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం చీడిగా హైవే రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, తొందరపడి దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రతి గింజనూ బాధ్యత తీసుకుని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 59 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మొత్తం 95 వేల మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేసిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రైతుల ఖాతాల్లో రూ. 11,300 కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. జిల్లాలోని 225 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని, గోనె సంచులను అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఎవరూ అపోహలు నమ్మవద్దని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎం. దేవులా నాయక్, వ్యవసాయ శాఖ జేడీ ఎన్. విజయ్ కుమార్, సహకార శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations